Site icon NTV Telugu

Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీపై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు

Sanjay Dutt

Sanjay Dutt

ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా  సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి  జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో సంజయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అధీరా పాత్రలో సంజయ్ లుక్ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంజూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

” క్యాన్సర్ తో పోరాడిన తర్వాత ఇలాంటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలోను ఇటువంటి నేరపూరితమైన పాత్రలను పోషించాను. సెట్ లో అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నా హెల్త్ బాలేదని ప్రశాంత్ చిన్న చిన్న సీన్స్ చేయించేవాడు.. కనై, నేను అందుకు ఒప్పుకోలేదు. పాత్రకు ఎలాంటి సీన్స్ అనుకున్నారో అన్ని చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఒక నటుడిని.. నా జీవితం చివరి వరకు నేను నటిస్తూనే ఉంటాను. ఇక సౌత్ ఇండస్ట్రీ గురించి అడిగిన ప్రశ్నకు ” కెజిఎఫ్ 2 అనేది పాన్ ఇండియా మూవీ కాదు.. అది హిందుస్తానీ సినిమా.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అంత అద్భుతంగా  మలిచాడు. అతనికి ఈ సినిమా ఎలా తీయాలి అనేదానిమీద మంచి పట్టు ఉంది. ఇక యష్ తో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. రవీనా టండన్ అద్భుతంగా నటిస్తుందని” ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version