Site icon NTV Telugu

JR NTR : ఎన్టీఆర్ కు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్ ఆమెనే..

Ntr

Ntr

JR NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలు ఉన్నాయి. చాలా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు యంగ్ టైగర్. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో తల్లిగా, భార్యగా నటించిన ఒక నటి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2004లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది.

Read Also : Anupama Parameshwaran : ఆమెపై కేసు పెట్టిన అనుపమ.. అలా చేస్తోందంట

అయినా ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన డ్యూయల్ రోల్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో ఆయన శంకర్ పెహల్వాన్ గా కనిపించగా.. కొడుకు పాత్రలో కూడా తారకే నటించాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో చేసిన శంకర్ పెహల్వాన్ భార్య పాత్రను నటించింది ప్రముఖ నటి సంఘవి. సినిమా కథలో సంఘవి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శంకర్ పెహల్వాన్ భార్యగా, ఆ తర్వాత కొడుకుకు తల్లిగా ఆమె కనిపించింది. అంటే ఒకే సినిమాలో ఎన్టీఆర్‌కు భార్యగా, తల్లిగా రెండురకాల పాత్రలు పోషించింది. ఇది అప్పట్లో పెద్ద హైలైట్‌గా మారింది.

Read Also : Peddi : రామ్ చరణ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఏఆర్.రెహ్మాన్..

Exit mobile version