NTV Telugu Site icon

Hyderabad: సంధ్య 70ఎంఎం థియేటర్‌ @ 44 ఏళ్లు

Sandhya 70mm

Sandhya 70mm

Hyderabad: హైదరాబాద్ నగరం అంటే సినిమాలకు పెట్టింది పేరు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమా విడుదలైందంటే అక్కడ ఉండే హడావిడి వేరు. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చాలా థియేటర్లు ఉండేవి. కానీ మల్లీప్లెక్సుల రాకతో థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఐదు థియేటర్లు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. అందులో సుదర్శన్ 35ఎంఎం, దేవి 70ఎంఎం, సంధ్య 70ఎంఎం, సంధ్య 35 ఎంఎం, సప్తగిరి 70ఎంఎం థియేటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే సంధ్య 70ఎంఎం థియేటర్ ఏర్పాటు చేసి 44 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సంధ్య థియేటర్‌ గురించి అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అనంతర కాలంలో సంధ్య 35ఎంఎం థియేటర్ నిర్మాణం కూడా జరిగింది.

Read Also: Vijay Zol: అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ అరెస్ట్

సినిమాలకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 1979, జనవరి 18న సంధ్య 70ఎంఎం థియేటర్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి ఉమ్మడి ఏపీ మంత్రి జి.వెంకటస్వామి ఈ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ థియేటర్‌లో ప్రారంభోత్సవ చిత్రంగా హిందీ మూవీ షాలిమార్‌ను ప్రదర్శించారు. అప్పట్లో ఏసీ థియేటర్‌గా మాత్రమే ఈ హాలు ఉండేది. ఇటీవల కోవిడ్ సమయంలో ఈ థియేటర్‌ను ఆధునీకరించి 4కే ప్రొజెక్షన్, డాల్మీ ఎట్మాస్ సౌండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ఈ థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గతంలో ఉన్న సుదర్శన్ 70ఎంఎం, ఓడియన్ 70 ఎంఎం, ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్, శ్రీమయూరి, ఉషా మయూరి లాంటి థియేటర్లు ఇప్పుడు కనుమరుగు అయ్యాయి. వీటి స్థానంలో షాపింగ్ మాల్స్ నిర్మాణం జరుగుతోంది.