NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: నెల రోజుల్లో ఆ సినిమా పనులు షురూ…

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

సందీప్ రెడ్డి అంటేనే ఓ సెన్సేషన్. తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ పై చూపించడానికి ఏ మాత్రం ఆలోచించడు. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్… అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌ని షేక్ చేశాడు. ఆ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌తో అనిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల కొల్లగొట్టేశాడు. ప్రస్తుతం అనిమల్ సినిమా ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వైలెన్స్‌ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందని… అబ్రార్ తమ్ముడిని మోస్ట్ వైలెంట్‌గా చూపించి రణ్‌బీర్ వర్సెస్ రణ్‌బీర్‌గా అనిమల్ పార్క్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే ప్రభాస్‌తో ‘స్పిరిట్’, అల్లు అర్జున్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి.

ఈ మధ్యలో సల్మాన్ ఖాన్‌తో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ బయటికి వచ్చింది. దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది తేలడం లేదు కానీ ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా స్పిరిట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు అనిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. లేటెస్ట్ బాలీవుడ్ టాక్ ప్రకారం… అనిమ‌ల్ పార్క్‌ 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ ఫిబ్రవరి నెలలో స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్ట‌నున్న‌ట్లుగా బీ టౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే న‌టీన‌టుల ఎంపిక‌ కూడా స్టార్ట్ చేశాడట సందీప్. అనిమల్‌లో బోల్డ్‌గా న‌టించిన‌ త్రిప్తి డిమ్రి సీక్వెల్‌లో కీ రోల్ ప్లే చేయనుంది. త్వరలోనే అనిమల్ పార్క్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. మరి అనిమల్ పార్క్ ఎలా ఉంటుందో చూడాలి.