Site icon NTV Telugu

Sandeep Reddy Vanga: స్పిరిట్ మొదలు కాబోతుందంట.. సిద్ధంగా ఉండండమ్మా

Prabhas

Prabhas

Sandeep Reddy Vanga: అనిమల్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా నిజంగానే హీరోలా మారిపోయాడు. సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా.. వారందరికీ తనదైన రీతిలో కౌంటర్లు వేసి షాక్ లు ఇచ్చాడు. ఇక ఎప్పుడు ఏ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లని సందీప్.. నేడు గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళాడు. ఇక సందీప్ బయట కనిపిస్తే.. అందరూ అడిగే ఒకే ప్రశ్న స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా నెలలు గడిచినా.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. మధ్యలో ప్రభాస్ కల్కి ఒకటి చేస్తున్నాడు.. సందీప్ అనిమల్ పార్క్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. దీని తరువాత స్పిరిట్ పట్టాలెక్కుతోందని సమాచారం. ఇక స్పిరిట్ గురించి గామి ట్రైలర్ ఈవెంట్ లో ఒక క్లారిటీ ఇచ్చాడు సందీప్.

” ట్రైలర్ చాలా బావుంది. చాలా అరుదైన సినిమా ఇది. ఆరేళ్ళు పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా పాషన్ వుంటేనే ఇది సాధ్యమౌతుంది. మేకప్ అందుబాటులో లేనప్పుడు విశ్వక్ స్వయంగా మేకప్ చేసుకున్న సందర్భాలు వున్నాయి. సౌండ్ డిజైన్ కలర్ గ్రేడింగ్ చాలా టెర్రిఫిక్ గా వున్నాయి. థియేటర్స్ లో చూసేటప్పుడు మంచి ఎక్స్ పీరియన్స్ వస్తుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. కథని చాలా డిఫరెంట్ గా చెప్పారు. టీం అందరికీ గుడ్ లక్. మార్చి 8న తప్పకుండా చూడండి.. ఇక స్పిరిట్ గురించి చెప్పాలంటే.. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి” అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ అభిమానులు.. స్పిరిట్ మొదలుకాబోతుంది.. రచ్చ చేయడానికి సిద్ధంగా ఉండండమ్మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version