Sandeep Reddy Vanga: వెళ్లి నీ మాజీ భర్తను అడుగు.. కిరణ్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. సినిమాలు తీయడంలోనే కాదు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఎలా ఇవ్వాలో బాగా తెలిసినోడు. చాలామంది ఈయనకు బలుపు అంటారు. ఇంకొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఆ బలుపు ఉండాల్సిందే అంటారు. ఇక అనిమల్ సినిమా ఓటిటీలోకి వచ్చాకా కూడా ట్రోల్స్ ఆగలేదు. ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రిటీలు అనిమల్ సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నారు. రాధికా, కస్తూరి, తాప్సీ.. ఇలా ఒక్కొకరుగా అనిమల్ సినిమా దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. ఇక ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా చేరింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె అనిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ” బాహుబలి, కబీర్ సింగ్, అనిమల్ స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక కిరణ్ రావు వ్యాఖ్యలపై వంగా తనదైన స్టైల్ లో ఆన్సర్ చెప్పుకొచ్చాడు.
కిరణ్ రావు పేరు తీసుకురాకుండానే.. “ఆమె అన్న వ్యాఖ్యలు నేను విన్నాను. ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ ను వెళ్లి అడగమనండి.. ఆయన నటించిన దిల్ సినిమాలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా చేస్తాడు. అది కూడా ఆమె తప్పు చేసిందని నమ్మిస్తాడు. చివరికి ఆ అమ్మాయి.. హీరోనే ప్రేమిస్తుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!