NTV Telugu Site icon

Animal: ‘యానిమల్’ సీక్వెల్ గురించి అప్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ

Untitled Design (52)

Untitled Design (52)

అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఏడేళ్లలో డైరెక్టర్‌గా తన మార్కు చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఎంతో మంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్చుకున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సందీప్ రెడ్డి వంగ చాలా సార్లు స్పందించనప్పటికి.. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో తిరిగి సందీప్ వంగా స్పందించారు. అలాగే ‘యానిమల్’ సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.

Allso Read: Niharika: ఓటీటీలోకి వచ్చేసిన నిహారిక తమిళ్ సినిమా..

సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. ‘ ‘యానిమల్’ ని విమర్శించినవారంతా రణ్ బీర్‌ను మాత్రం తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరూ హీరోను విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ లేదు. కానీ రణ్ బీర్ తెలివైన వ్యక్తి అయితే మరి రచయిత, దర్శకుడి పరిస్థితేంటి? నాకు ఈ తేడా ఇప్పటికీ అర్ధంకాలేదు. వారంతా రణ్ బీర్ తో కలిసి వర్క్ చేయలనుకుంటున్నారు. కాబట్టి అతని ఏమీ అనలేదు. నేను పరిశ్రమకు కొత్త కాబట్టి నన్ను విమర్శింస్తున్నారు ఇది నిజం’ అని అన్నాడు. అలాగే ‘యాక్షన్ ప్రియులంతా ‘యానిమల్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఇది ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్‌తో రానుంది. దీని మూడు భాగాలుగా చేయాలనుకుంటున్నా. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఈ ఆలోచన ఉంది. ఇక ఈ యానిమల్ పార్క్ లో రణ్ బీర్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. హీరో, విలన్ రెండు పాత్రలు అతనే చేయనున్నాడు’ అని తెలిపాడు.