Chiranjeevi: ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో ఒక్క సినిమా పడినా.. బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది మావా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలపై బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఒక రా అండ్ రస్టిక్ డైరెక్టర్ చేతికి ఒక స్టార్ హీరో చిక్కాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని కాదు దానికి మించి ఉంటాయి. అదే ఒక అభిమాని డైరెక్టర్ గా మారి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే..నెక్స్ట్ లెవెల్ కదా.. ఇంతకీ ఆ కాంబో ఏంటి.. ? ఎందుకు ఇప్పుడు ఇదంతా చర్చించుకుంటున్నాం అంటే.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి.. చిరుకు ఈ గౌరవాన్ని అందించింది. ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందు క్యూ కట్టింది. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖులు.. చిరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సెన్సేషనల్ డైరెక్టర్స్ చిరును కలవడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
వారెవరో కాదు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ.. చిరును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇకచిరు.. వీరితో కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు సందీప్. దసరా లాంటి రా అండ్ రస్టిక్ సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ.. చిరు ఫ్యాన్స్ కావడం విశేషం. సందీప్ ఎప్పటి నుంచో చిరుతో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ దసరా తరువాత స్టార్ హీరోల నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరితో చిరు సినిమా ఒక్కటి పడినా కూడా బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తికాదని చెప్పొచ్చు. మరి చిరు.. వీరిలో ఎవరినో ఒకరిని ఓకే చేస్తాడేమో చూడాలి.
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!