Site icon NTV Telugu

Sandeep Reddy : ఆ డైరెక్టర్ల బాటలో సందీప్ రెడ్డి..?

Sandeep

Sandeep

Sandeep Reddy : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు అనే దానిపై మొన్నటి దాకా భారీ సస్పెన్స్ ఉండేది. కానీ వాటికి తెర దించుతూ త్రిప్తి డిమ్రీని ప్రకటించాడు సందీప్ రెడ్డి. ప్రభాస్ తర్వాత ఈ మూవీలో ప్రకటించింది కేవలం త్రిప్తిని మాత్రమే. యానిమల్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది త్రిప్తి. కానీ ఆ పాత్రతో ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి త్రిప్తిని ఇప్పుడు సందీప్ స్పిరిట్ కోసం తీసేసుకున్నాడు.

Read Also : Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం

ఈ నడుమ చాలా మంది డైరెక్టర్లు తమ హిట్ సినిమాల్లోని హీరోయిన్లను రిపీట్ చేయడం చూస్తున్నాం. ఒక మూవీలో చేసిన హీరోయిన్ ను మరో రెండు, మూడు మూవీలోకి కూడా తీసుకుంటున్న డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. వారికి ఆ హీరోయిన లక్కీ అనుకుంటారు. త్రివిక్రమ్ పూజాహెగ్డేను రిపీట్ చేసేవాడు. బోయపాటి శ్రీను ప్రగ్యా జైస్వాల్ ను, గోపీచంద్ మలినేని శృతిహాసన్ ను.. ఇలా చాలా మంది డైరెక్టర్లు కొందరు హీరోయిన్లను రిపీట్ చేస్తుంటారు.

ఇప్పుడు సందీప్ రెడ్డి కూడా ఇదే బాటలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన నాలుగో సినిమాకే ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టేశారు. త్రిప్తి, సందీప్ కు మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అందుకే ఆమెకు మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా సందీప్ కండీషన్లకు కూడా త్రిప్తి అడ్డు చెప్పట్లేదు. అదే ఆమెకు ప్లస్ అయినట్టుంది.

Read Also : Nimmala Rama Naidu: ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు.. రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు!

Exit mobile version