‘భీమ్లా నాయక్’ సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉంది. డానియల్ శేఖర్ అకా రానా దగ్గుబాటికి జోడిగా నటించిన సంయుక్త పాత్రకు అంత ప్రాముఖ్యత ఏం లేదు. అయినప్పటికీ ఆమె తనకున్న స్పేస్ లోనే తన నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే ఈ సినిమా స్క్రీన్ టైమ్ విషయంలో సంయుక్త నిరాశకు గురైందని వార్తలు వచ్చాయి. ఆమె సినిమా కోసం దాదాపు 20 రోజులు పని చేసింది. సినిమా షార్ప్ రన్ టైమ్ కారణంగా ఆమెకు ఈ చిత్రంలో పెద్దగా స్కోప్ రాలేదు అంటూ గాసిప్‌లు రౌండ్లు వేస్తున్నాయి.
Read Also : Radhe Shyam Trailer : డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్… తప్పు ఎక్కడ జరిగిందంటే ?
ఈ రూమర్ పై తాజాగా సంయుక్త స్పందించింది. తాను మనస్తాపం చెందిన మాట నిజమేనని అంటూ ఓ సెటైరికల్ పోస్ట్ చేసింది. “అభిమానులందరితో కలిసి సినిమాని రెండోసారి చూసేందుకు ట్రై చేయగా, టిక్కెట్లు దొరకనప్పుడు ‘భీమ్లా నాయక్’తో నేను నిరాశ చెందాను” అని పుకారుపై సంయుక్త పోస్ట్ చేశారు. ‘భీమ్లా నాయక్’ విడుదలకు ముందే సంయుక్త ధనుష్ నటించిన ‘సర్’కి సంతకం చేసింది. ఇది ద్విభాషా. ‘భీమ్లా నాయక్’ సక్సెస్‌తో ఆమె రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టుల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
