Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Sampoornesh Babu Exclusive Interview About Martin Luther King Movie

Sampoornesh Babu: నాకు వర్క్ షాప్ ఏంటి అనుకున్నా.. ఎప్పుడో నేర్చుకున్న నటనను మళ్ళీ గుర్తు చేశారు!

Published Date :October 24, 2023 , 4:16 pm
By Bhargav Chaganti
Sampoornesh Babu: నాకు వర్క్ షాప్ ఏంటి అనుకున్నా.. ఎప్పుడో నేర్చుకున్న నటనను మళ్ళీ గుర్తు చేశారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sampoornesh Babu Exclusive Interview about Martin Luther King Movie:వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ సినిమాలో ముఖ్యపాత్ర పోషించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం నాడు విలేకర్లతో ముచ్చటించిన సంపూర్ణేష్ బాబు సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ రీమేక్ చేయడానికి కారణం ఏంటి? తెలుగుకి తగ్గట్టుగా ఎలాంటి మార్పులు చేశారు?
సంపూర్ణేష్ బాబు: తెలుగు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు, మహా సినిమా చేద్దామని పిలిచి, మండేలా మూవీ చూపించారు. నాకు తమిళ్ అంతగా అర్థం కాదు అంటే, పర్లేదు ఆ పాత్రను అర్థం చేసుకోండి చాలు, ఇప్పటిదాకా మీరు చేసిన భారీ డైలాగ్ లు లాంటివి వద్దు, మాకు కొత్తగా కావాలని చెప్పారు. నా నుంచి కొత్తగా ఏదో ఆశిస్తున్నారని అర్థమై, సరే చేద్దామని చెప్పాను.

ఇప్పటిదాకా సంపూ చేసిన పాత్రలు, సినిమాలు వేరు. ఆ ఇమేజ్ కి భిన్నంగా ఈ పాత్ర చేయించడం ఛాలెంజ్ అనిపించిందా?
సంపూర్ణేష్ బాబు: ‘’నేను హృదయ కాలేయం సినిమా చూసినప్పుడు స్క్రీన్ మీద ఉన్నది, నేను ఒక్కడేనా అనే ఫీలింగ్ కలిగింది, నరసింహాచారి అనే వ్యక్తి సంపూర్ణేష్ బాబు కావడం, హృదయ కాలేయం సినిమా రావడం అప్పటికి నన్ను నేను నమ్మలేకపోయాను’’, ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూస్తే కలిగింది, నేను ఎన్ని సినిమాలు చేసినా, పెద్ద పెద్ద డైలాగులు చెప్పినా, డ్యాన్స్ లు చేసినా డైరెక్టర్ వర్క్ షాప్ చేద్దామన్నారు. ఆమెకు ఇది మొదటి సినిమా కానీ నేను ఇప్పటికే సినిమాలు చేసి ఉన్నాను కదా వర్క్ షాప్ ఏంటి? సరే చూద్దాంలే అనుకున్నాను కానీ నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను మళ్ళీ గుర్తు చేశారు డైరెక్టర్.

రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు ఒరిజినల్ నటుడి ప్రభావం ఎంతో కొంత పడుతుంది, మరి దానిని మీరు అధిగమించారు?
సంపూర్ణేష్ బాబు: నేను ఆ నటుడుని ఫాలో కాలేదు. మీరు నరసింహాచారిలా ఊరిలో ఎలా ఉంటారో అలా ఆఫీస్ కి రండి అని డైరెక్టర్ చెప్పారు, చెప్పులు కుట్టే సాధారణ వ్యక్తి ఎలా నడుస్తాడో అలాంటి నడక కావాలి ఆమె అన్నారు. నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను నిద్ర లేపింది ఈ పాత్ర, నేను ఆ పాత్ర అంత బాగా చేయడానికి కారణం డైరెక్టర్ పూజ.

ఈ సినిమా ప్రభావం మీ తదుపరి సినిమాలను ఎంచుకునే అంశంపై ఎలా ఉండబోతుంది?
సంపూర్ణేష్ బాబు: ఇప్పటికైతే దాని గురించి ఏం ఆలోచించడం లేదు. ఇదొక కొత్త సినిమా, ప్రయోగం చేశా, ముఖంగా నన్ను కొత్తగా చూపించారు, ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్లు వేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది, ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలామంది నీకు సరైన సినిమా పడిందని అంటున్నారు. సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదరుచూస్తున్నా, ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగిందనిపించింది.

కామెడీ సినిమాలు చేయడం సులభంగా ఉందా? ఇలాంటి సినిమా చేయడం సులభంగా ఉందా?
సంపూర్ణేష్ బాబు: ఇది నా మొదటి సినిమా లాగా చేశా, కష్టమైనా, ఇష్టమైనా నటుడిగా అన్నీ చేయాలి. గత సినిమాలు నాకు కష్టం అనిపించలేదు, కానీ ఈ సినిమానే కష్టం అనిపించింది. ఈ పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా కొద్ది నెలలు పాటు ఓ సన్యాసిలా బ్రతకాలి, ఒక ఖాళీ బాటిల్ లా ఉండాలి ఆ బాటిల్లో పాలు పోస్తే పాల బాటిల్, నీళ్ళు పోస్తే నీళ్ళ బాటిల్, పెట్రోల్ పోస్తే పెట్రోల్ బాటిల్ అవ్వాలి, అలా ఉండటం కోసం చాలా వర్క్ చేశాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #martin luther king
  • Martin Luther King Movie
  • Martin Luther King release
  • Sampoornesh Babu

తాజావార్తలు

  • War Effect : తెలంగాణలో వార్ ఎఫెక్ట్.. చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

  • Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్

  • Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

  • Ustaad Bhagat Singh Trailer: ఇచ్చిపడేసే గోత్రం .. ఇరగదీసే నక్షత్రం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ వచ్చేసింది

  • Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions