Site icon NTV Telugu

ఈ నెల 26న సంపూ ‘క్యాలీఫ్లవర్’

సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. శీలో రక్షతి రక్షితః అనేది ట్యాగ్ లైన్. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఆర్కే మలినేని డైరెక్టర్. సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి నాయికగా నటించిన ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఆద్యంతం వినోద భరితం సాగే చిత్రం ఇదని, ఇప్పటిక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించిందని దర్శక నిర్మాతలు తెలిపారు. పోసాని, పృథ్వీ, నాగమహేశ్, గెటప్ శీను, రోహిణి, కాదంబరి కిరణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ‘క్యాలీఫ్లవర్’ మూవీని ఇదే నెల 26న విడుదల చేయబోతున్నారు.

Exit mobile version