Site icon NTV Telugu

కీర్తి సురేష్, త్రిషలతో సామ్ వీకెండ్ పార్టీ… పిక్స్ వైరల్

Samantha’s Weekend Party With Trisha And Keerthy Suresh, Kalyani Priyadarshan

సమంత అక్కినేని గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అక్కినేని టాలీవుడ్ ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు. అయితే ఒకవైపు ఈ హీరోయిన్ గురించి ఆందోళకర రూమర్స్ చక్కర్లు కొడుతుంటే ఆమె మాత్రం తన కుక్క పిల్లలతో, స్నేహితులతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకు ఇష్టమైన పనులు చేస్తూ విశ్రాంతి సమయాన్ని గడుపుతోంది. తన పెంపుడు కుక్కలతో గడపడం నుండి ఆమె స్నేహితులతో సరదాగా గడిపే వరకు ఆమె చేస్తున్న అన్ని పనులను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.

తాజాగా సామ్ షేర్ చేసిన అలాంటి పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మొత్తం కోలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఉండడం విశేషం. సెప్టెంబర్ 20న త్రిష, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, ప్రీతం జుకల్కర్‌తో కలిసి ఉన్న ఫోటోను సామ్ ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసుకుంది. వీకెండ్ పార్టీలో ఈ స్టార్ హీరోయిన్లంతా కలిసి సరదాగా గడిపినట్టు పిక్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది.

Read Also : మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాగార్జున స్పెషల్ వీడియో

నాగ చైతన్యతో విడాకులు అంటూ వస్తున్న వార్తల గురించి అడిగినందుకు సమంత ఇటీవల ఓ విలేకరిపై విరుచుకుపడి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లోనే బెస్ట్ జోడిగా చెప్పుకునే సమంత, చైతన్య నాలుగు సంవత్సరాల వివాహ జీవితాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్ గా సామ్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆ సమయంలోనే ఓ జర్నలిస్ట్ విడాకుల విషయం ప్రస్తావించగా… ‘బుద్దుందా ఇది గుడి” అంటూ సామ్ అతనిపై ఫైర్ అయ్యింది.

ఇటీవల దర్శకులు రాజ్ అండ్ డికె దర్శకత్వంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తో డిజిటల్ అరంగేట్రం చేసిన సామ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న “శాకుంతలం”. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఆమె కిట్టిలో ఉన్న మరో తమిళ చిత్రం దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న “కథువాకుల రెండు కాదల్”. ఇక ఇటీవలే సామ్ శ్రీదేవి మూవీస్ అనే బ్యానర్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Exit mobile version