Site icon NTV Telugu

టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్… అగ్రస్థానంలో సామ్ సాంగ్

Samantha

2021 ఎండింగ్ కు వచ్చేసింది… దీంతో రివైండ్ 2021 అంటూ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాలను నెమరేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ట్రెండ్‌ ప్రకారం యూట్యూబ్ వారి వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది 100 పాపులర్ సాంగ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. ‘పుష్ప’ నుంచి ఇటీవల విడుదలైన “ఊ అంటావా ఉఊ అంటావా” సాంగ్ తెలుగు వెర్షన్‌ ఈ లిస్ట్ లో నెం.1లో నిలిచింది. ‘పుష్ప’ ఆల్బమ్ లోని శ్రీవల్లి సాంగ్ 22వ స్థానంలో, 25వ స్థానంలో ‘సామీ సామి’ (తమిళం), ‘ఊ అంటావా’ (హిందీ) 42వ స్థానంలో నిలిచి సంగీత ప్రియుల ఆదరణ పొందుతోంది. 51వ స్థానంలో ‘సామీ సామీ’ తెలుగు వీడియో సాంగ్, 68వ స్థానంలో ‘సామీ సామి’ తెలుగు లిరికల్ సాంగ్ ఉండడం విశేషం. మొత్తానికి ‘పుష్ప’ పాటలతో ఈ ఏడాది యూట్యూబ్ షేక్ అవుతోంది. ఈ సూపర్‌ హిట్ ఆల్బమ్‌ను అందించింది దేవిశ్రీ ప్రసాద్‌ అన్న విషయం తెలిసిందే. ఆయన మ్యూజిక్ అన్ని భాషల ప్రేక్షకులనూ అలరిస్తోంది.

https://ntvtelugu.com/playback-singer-actor-manikka-vinayagam-passes-away/

“టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్” ప్లేజాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ‘ఊ అంటావా’ సాంగ్ లో సామ్ మెరిసిన విషయం తెలిసిందే. నిజానికి సామ్ చేసిన మొదటి ఐటెం సాంగ్ ఇదే. ఆమె గ్లామర్ కు, సాంగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాంగ్ లిరిక్స్ వివాదాస్పదమైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version