Site icon NTV Telugu

Subham: సమంతకు ఓటీటీ షాక్?

Subham

Subham

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ హారర్ కామెడీ జానర్ సినిమా మే 9, 2025న థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, శ్రీయ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి వంటి కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రంలో సమంత కూడా ఓ కీలక క్యామియో రోల్‌లో కనిపించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ విషయంలో సమంత తీసుకున్న ఓ కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Also Read :Bigg Boss 9: అంతా ఒట్టిదే.. అసలు కథ ఇదే

‘శుభం’ సినిమా డిజిటల్ మరియు సాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్ కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత జీ గ్రూప్ తమ ఒప్పందంలో మార్పులు చేయాలని ప్రయత్నించింది. ముందుగా ఒప్పుకున్న అమౌంట్ కంటే తక్కువ చెల్లిస్తామని, ఓటీటీ డీల్ విషయంలో మెలికలు పెట్టినట్లు సమాచారం. ఈ వైఖరితో విసిగిపోయిన సమంత, జీ గ్రూప్‌తో డీల్‌ను పూర్తిగా రద్దు చేస్తూ గట్టి నిర్ణయం తీసుకున్నారు. “అసలు మీకు ఈ సినిమా ఇవ్వడం లేదు” అని స్పష్టంగా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

Also Read : Tollywood : సమ్మర్ ను వదిలేసిన స్టార్ హీరోలు..

జీ గ్రూప్‌తో ఒప్పందం రద్దయిన తర్వాత, సమంత ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని, త్వరలోనే ‘శుభం’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సమంత నిర్మించిన తొలి సినిమాకు థియేటర్లలో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ పరంగా వెనుకబడిన నేపథ్యంలో, ఓటీటీ రిలీజ్ ద్వారా మంచి ఆదాయం సాధించాలని ఆమె భావిస్తున్నారు. సమంత తన తొలి నిర్మాణ చిత్రంతో రిస్క్ తీసుకున్నప్పటికీ, ఆమె వ్యాపార వ్యూహం ఆకట్టుకుంటోంది. జీ గ్రూప్‌తో డీల్ రద్దు చేసి, జియో హాట్‌స్టార్ వంటి బలమైన ప్లాట్‌ఫామ్‌తో చర్చలు జరపడం ఆమె వ్యాపార కోణాన్ని సూచిస్తోంది.

Exit mobile version