అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. సామ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం సామ్ అభిమానులందరిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కట్టే .. చై తో విడిపోయాక ఆమె హ్యాపీగా ఉందా..? అని.. కొన్ని బాధలు దూరం అయినా వారి గుర్తులు, జ్ఞాపకాలు ఎప్పుడు వారిని గుర్తుచేస్తూనే ఉంటాయి. అలాగే చై గుర్తులు ఇంకా సామ్ ఒంటిపైనే ఉన్నాయి.. అదేనండీ టాటూస్.. చైతన్యకు సంబంధించిన మూడు టాటూస్.. సామ్ ఒంటిపై అలాగే ఉండిపోయాయి. మొదటిది.. ఆమె మెడ కింద భాగంలో ఉన్న ‘ymc’.. వీరిద్దరి ప్రేమకు పరిచయ వేదికగా మారిన ‘ఏ మాయ చేసావే’ చిత్రం పేరును టాటూ వేయించుకొంది..
ఇక పెళ్లికి కొద్దిరోజుల ముందు ఈ జంట తమ కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకున్నారు.. ఇది ప్రేమకు చిహ్నమని చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి తరువాత చై మీద ప్రేమతో నడుము పై భాగంలో ‘chey’ అని టాటూ వేయించుకుంది. ఇక ఆ తరువాత వీరి పేరేమ అటకెక్కింది.. విడాకుల వరకు వచ్చింది.. కానీ టాటులు మాత్రం అలాగే ఉండిపోయాయి. బ్రేకప్ అయ్యాకా, విడాకులు అయ్యాక వాటిని సర్జరీ ద్వారా తీసేయించుకుంటారు చాలామంది ప్రముఖులు .. కానీ సామ్ అలా చేయలేదు.. ఇప్పటికి ఈ మూడు టాటూలు సామ్ ఒంటిపై ఉన్నాయి.. అందుకు సాక్ష్యం మొన్న సామ్ చేసిన హాట్ ఫోటోషూట్.. అందులో సామ్ బికినీ టాప్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ ఫొటోలో కూడా అమ్మడి నడుము పైభాగంలో చై పేరు కనిపిస్తోంది. దీంతో సామ్ టాటూ లను కావాలనే ఉంచుకుందా..? లేక తొలగించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యిందా..? అని అభిమానులు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మరి ఈ విషయంపై ఎప్పుడైనా సామ్ నోరు విప్పుతుందేమో చూడాలి.