Site icon NTV Telugu

Samantha : ఫొటోలతో జీవిత పాఠాలు… కొత్త ఫిలాసఫీ

Samantha

సమంత ఈ మధ్య చాలా సెలవులు తీసుకుంటోంది. వెకేషన్స్ లో ఎక్కువగా గడుపుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కొన్ని క్రితం ఆమె స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో స్కీయింగ్ నేర్చుకుంటూ కనిపించింది. ఇప్పుడు సామ్ మరొక ప్రసిద్ధ టూరింగ్ డెస్టినేషన్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో వేదికగా తన ఆలోచనలను, కొత్త కొత్త ఫోటోలను, అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అలాగే ఆమె షేర్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : ET Teaser: మనల్ని ఎవరూ ఏం చేయలేరు అంటున్న సూర్య

“జీవితం…. మీరు దాన్ని ఆస్వాదించండి లేదా అది వచ్చినప్పుడు, పోతున్నప్పుడు, అది ఎగసిపడుతున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు సహించండి” అంటూ సరికొత్త ఫిలాసఫీని చెప్పుకొచ్చింది. ఇక ఫోటోలను చూస్తుంటే కేరళలోని అతిరప్పిల్లి జలపాతం వద్ద గడిపినట్లు అన్పిస్తోంది. సమంతా పంచుకున్న మొదటి ఫొటోలో ఆమె జలపాతం దగ్గర ఒక రాతిపై నిలబడి ఉండగా, బంగారు సూర్యకాంతి ఆమెపై ప్రకాశిస్తుంది. ఇక ఆమె పింక్ ట్యాంక్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్‌ ను ధరించింది. సమంత ఈ పోస్ట్‌ను షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే అభిమానులు, స్నేహితుల నుండి లైకులు, కామెంట్స్ తో ఆమెపై ప్రేమను కురిపించారు. సమంత త్వరలోభారీ బడ్జెట్ పౌరాణిక లవ్ డ్రామా “శాకుంతలం” చిత్రంలో కనిపించనుంది.

Exit mobile version