Site icon NTV Telugu

Samantha: సామ్ సంచలన నిర్ణయం.. అక్కినేని ఫ్యామిలీ చెప్పింది కూడా అదే కదా..?

Samantha

Samantha

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టి కెరీర్ ను అందంగా మలుచుకొంటుంది. ఇక ప్రస్తుతం సామ్ నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా బాలీవుడ్ లో రెండు సినిమాలు, హాలీవుడ్ లో ఒక సినిమా సెట్స్ మీద ఉన్నాయి. మొదటి నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్న సామ్.. అక్కినేని నాగ చైతన్య ను వివాహమాడిన తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మంచి హిట్లను కూడా అందుకొంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీసే అమ్మడి కొంప ముచ్చిందని టాలీవుడ్ కోడై కూసింది. అందులో హద్దుమీరిన సన్నివేశాలు చేయడం వలనే అక్కినేని ఇంట విబేధాలు తలెత్తాయని, ఈ సిరీస్ వలనే చైతూ, సామ్ విడిపోయారని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. అక్కినేని ఫ్యామిలీ పెళ్లి తరువాత సామ్ ను సినిమాలు చేయొద్దు అని చెప్పలేదు. కాకపోతే కుటుంబానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేయొద్దని, ముఖ్యంగా ఇలాంటి పాత్రలు చేయడం వలన అక్కినేని పేరును ట్రోల్స్ చేస్తారని చెప్పారట. అయినా సామ్ వినలేదని, పాత్ర నచ్చడంతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేస్తానని చెప్పడంతో చైతూ, సామ్ కు గొడవలు అయ్యినట్లు చెప్పుకొచ్చారు.

ఇక విడాకులు అయ్యాక సామ్ హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయిన సంగతి తెల్సిందే.. బికినీలు, బ్రాండ్ అంబాసిడర్ ఫోటో షూట్ అంటూ ఎంతో హంగామా చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకు సోషల్ మీడియాకు అమ్మడు బ్రేక్ ఇచ్చింది. ఇక తాజాగా సామ్ సంచలన నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న సినిమాలను ఫినిష్ చేసి, కొత్త సినిమాలను అంగీకరించాడనికి మాత్రం సామ్ కండిషన్స్ పెడుతున్నదట. ఇక నుంచి ఏ సినిమాలోనూ ఎక్స్ పోజింగ్ కానీ, హద్దుమీరే సన్నివేశాల్లో కానీ నటించబోయేది లేదని చెప్పుకొచ్చిందంట. ముద్దు సీన్లు కానీ, ఇంటిమేట్ రొమాన్స్ కానీ చేయనని ఖరాకండీగా చెప్తోందట. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని, అది ఎంత కష్టమైన నేర్చుకొని మరీ చేస్తానని చెప్పుకొచ్చిందట. ఇక ఈ వార్త విన్నాక నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం ఏదో విడాకుల ముందే తీసుకొని ఉంటే అక్కినేని ఇంటి కోడలిగా ఉండేదానివిగా అని కొందరు.. అప్పుడు అక్కినేని ఫ్యామిలీ చెప్పింది కూడా అదే కదా..? అని సెటైర్లు వేస్తున్నారు.

Exit mobile version