Site icon NTV Telugu

Samantha : స్టార్ డైరెక్టర్ తో సమంత పవర్ ఫుల్ మూవీ..?

Samantha

Samantha

Samantha : స్టార్ హీరోయిన్ సమంత నుంచి సినిమా రావాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. కానీ సమంత హీరోయిన్ గా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాతో శేఖర్ కమ్ముల డైరెక్షన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఆయన సినిమాలో నటిస్తే నటుడిగా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం అందరిలోనూ పెరిగిపోతోంది. గతంలో సమంత కూడా శేఖర్ కమ్ములతో మూవీ చేయాలని ఉందని తెలిపింది.

Read Also : Vijay Sethupathi : నా కొడుకు చేసిన పనికి క్షమించండి..

శేఖర్ కమ్ములతో సినిమా చేస్తే తనకు నటిగా గుర్తింపు పెరుగుతుందని చెప్పింది. ఇప్పుడు అదే బాటలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని సమాచారం. కుబేర తర్వాత శేఖర్ కమ్ముల నానితో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా జరిగాయి. కానీ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఎంత లేదన్నా రెండేళ్లు పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్ లో సమంతతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడంట శేఖర్. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లతో సినిమాలను పవర్ ఫుల్ గా మార్చడం శేఖర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు సమంతతో ఓ పవర్ ఫుల్ లేడీ కథతో సినిమా తీస్తున్నాడంట. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలోగా ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Read Also : Anil Ravipudi : సుడిగాలి సుధీర్ ను వాళ్లే రోస్ట్ చేయమన్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..

Exit mobile version