NTV Telugu Site icon

సమంతానా.. మజాకానా.. వంద మిలియన్ వ్యూస్ క్లబ్ లో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’

samantha

samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి.

ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డును సృష్టించింది. డిసెంబర్ 10 నవిడుదలైన ఈ పాట కేవలం ఇరవై రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో సామ్ అభిమానులు సమంతానా .. మజాకానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సుకుమార్-అల్లు అర్జున్ కాంబో తెరకెక్కిన పుష్ప డిసెంబర్ 17 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.

O Antava Mawa...Oo Oo Antava Lyrical |Pushpa Songs |Allu Arjun,Rashmika |DSP | Sukumar | Samantha