Site icon NTV Telugu

Samantha : సమంత తాజా లుక్‌పై నెటిజన్ల షాక్‌ – “తను మన సామ్ ఏనా ?” అంటూ కామెంట్లు..!

Samantha

Samantha

టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్‌ ప్రభు గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, క్యూట్‌నెస్‌ అన్నీ కలగలిపిన ప్యాకేజ్‌ అని చెప్పాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్ స్టార్‌గా ఎదిగిన సమంత, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే, ఆమె జీవితంలో అనుకోని మలుపు తెచ్చింది ఆరోగ్య సమస్య. మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమై, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు మెల్లగా మళ్లీ పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఇక తాజాగా సామ్‌ పాల్గొన్న ఒక ఈవెంట్‌ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read : Madhuri Dixit : అభిమానుల ఆగ్రహానికి బలైన మాధురి దీక్షిత్ – డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ రచ్చ!

మోడర్న్‌ డ్రెస్‌లో కనిపించిన సమంతను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కనిపించిన ఫిట్‌నెస్‌, గ్లో లా కాకుండా కొంచెం బలహీనంగా కనిపించడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కొంతమంది అభిమానులు, “ఇదేనా మన సమంత.. చాలా మారిపోయింది!”, “హెల్త్‌ ఇష్యూ వల్ల ఇంత బరువు తగ్గిందేమో”, “ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం సామ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు ఆమెను సపోర్ట్‌ చేస్తూ, “సమంత ధైర్యం అందరికీ ప్రేరణ.. ఇంత బలమైన ఆత్మవిశ్వాసం ఎవరికీ ఉండదు” అంటూ అభిమానులు హత్తుకునేలా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, సమంత కొత్త లుక్‌ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.

Exit mobile version