గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు నుండి జోనాస్ అనే ఇంటి పేరును తొలగించింది. ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అదే సమయంలో జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రియాంక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షో క్లిప్‌ను షేర్ చేసింది. దీనిలో ఆమె నిక్‌ని రోస్ట్ చేసే అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది. అంతేకాదు తన భర్త సోదరులు సోఫీ చార్నర్, డేనియల్ జోనాస్ లను కూడా వదల్లేదు.
Read Also : పెళ్ళికి ముందు కత్రినా, విక్కీ కోర్టు మ్యారేజ్… ఇలా ఎందుకో తెలుసా ?
ప్రియాంక తనకు తన భర్తకు మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రియాంక మాట్లాడుతూ ‘‘నిక్ కు, నాకు మధ్య 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కాబట్టి నిక్ అర్థం చేసుకోని 90ల నాటి పాప్ సంస్కృతి చాలా ఉన్నాయి. నేను వాటిని వివరించాను. టిక్ టాక్ గురించి, దానిని ఎలా ఉపయోగించాలో అనే విషయం గురించి నిక్ నాకు వివరించాడు. విజయవంతమైన నటనా జీవితం ఎలా ఉంటుందో నేను అతనికి చూపించాను. జోనాస్ బ్రదర్స్ ఆన్‌లైన్‌లో ఎంత కంటెంట్ పోస్ట్ చేశారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే నా ఫాలోవర్స్ ముందు వీళ్ళ ఫాలోవర్స్ తక్కువ. కాబట్టి జోనాస్ కుటుంబం నుండి అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిని నేనేనని భావిస్తున్నాను” అంటూ ప్రియాంక ఆ వీడియోలో చెప్పడం, అది విని నిక్, అతని సోదరులు కూడా నవ్వుకోవడం కన్పిస్తోంది.
కాగా ఈ వీడియోపై సామ్ స్పందించడం మరింత ఆసక్తికరంగా మారింది. సమంత తన ఇంస్టాలో ఈ జోనస్ బ్రదర్స్ పిక్ షేర్ చేస్తూ అమేజింగ్ అని కామెంట్ చేసింది.
