పెళ్ళికి ముందు కత్రినా, విక్కీ కోర్టు మ్యారేజ్… ఇలా ఎందుకో తెలుసా ?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ వారు స్పందించలేదు. రాజస్థాన్‌లో వారి రాయల్ వివాహ ఆచారాలకు ముందే విక్కీ, కత్రినా ముంబైలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. రణతంబోర్ సమీపంలోని రిసార్ట్‌లో తమ రాజరిక వివాహం కోసం జైపూర్‌కు వెళ్లే ముందు… విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాజస్థాన్‌లో రెండు వివాహ వేడుకలు ప్లాన్ చేశారట. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ప్రస్తుతం కత్రినా సినిమాల నుండి విరామం తీసుకుంది. ముంబైలో విక్కీతో కోర్టు వివాహం చేసుకోనుంది. అయితే కోర్టు వివాహం అంటే ఏంటి? అసలు కోర్టు వివాహం ఎందుకు చేసుకుంటారు? కోర్టు మ్యారేజ్ కు రిజిస్టర్ మ్యారేజ్ కు మధ్య తేడా ఏంటి? అంటే….

Read Also : రివ్యూ: దృశ్యం – 2

కోర్టు మ్యారేజ్ అంటే ఏంటి? ఎందుకు?
కోర్ట్ మ్యారేజ్ అంటే తమ కులం లేదా మతానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా వివాహం చేసుకోవడానికి అర్హులైన మగ, ఆడ జంట మధ్య వివాహాన్ని కోర్టు, వివాహ అధికారి (రిజిస్ట్రార్/మేజిస్ట్రేట్), ముగ్గురు సాక్షుల సమక్షంలో జరుపుకోవడం. పెళ్లి చేసుకునే జంట న్యాయవాది సహాయంతో కోర్టు వివాహం చేసుకుంటారు. కోర్టు వివాహానికి అర్హత వధువు వయస్సు కనీసం 18 సంవత్సరాలు, వరుడి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. వివాహ సమయంలో ఇద్దరూ ఎలాంటి మానసిక రుగ్మతతో బాధపడకూడదు. భారత సర్వోన్నత న్యాయస్థానం 2006లో చట్టం దృష్టిలో అన్ని వివాహాలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని నిరూపించడానికి ఇది ముఖ్యమైన ధృవీకరణ పత్రంగా మారింది. అంటే చట్టపరమైన భద్రత ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడం మాత్రం కష్టం.

కోర్టు మ్యారేజ్ కు రిజిస్టర్ మ్యారేజ్ కు మధ్య తేడా ?
సంప్రదాయ వివాహం తర్వాత వివాహ ధృవీకరణ పత్రం పొందడానికి, జంటలు చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహాన్ని నమోదు చేసుకోవాలి. దీన్నే రిజిస్టర్ మ్యారేజ్ అంటారు. వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నట్లు తెలిపే అధికారిక సాక్ష్యం. కోర్టు వివాహంలో అర్హులైన ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు సాక్షుల సమక్షంలో ఒకరినొకరు వివాహం చేసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా భారతీయ పౌరులుగా ఉండాలనేది కూడా తప్పనిసరి కాదు. ఒక భారతీయ వ్యక్తి, ఒక విదేశీ వ్యక్తి కూడా ఉండవచ్చు.

Related Articles

Latest Articles