Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్‌తో సమంత ఫోటోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Pregnancy: స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలం క్రితమే తాను గర్భవతినని ప్రకటించగా, ఇప్పుడు తొలిసారి తన బేబీ బంప్‌ను స్పష్టంగా చూపిస్తూ అభిమానులతో ప్రత్యేక క్షణాలను పంచుకుంది. దీంతో ఆమె కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. మస్టర్డ్ పసుపు రంగు బాడీకాన్ కేప్ గౌన్‌లో ఉన్న ఆమె, టర్కోయిస్ డ్రాప్ ఇయర్‌రింగ్స్‌తో మెరిసిపోయింది. ముఖ్యంగా బేబీ బంప్‌ను హైలైట్ చేస్తూ దిగిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 39 ఏళ్ల వయసులోనూ సమంతలో కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ గ్లోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫోటోలతో పాటు సమంత చేసిన పోస్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి దశ ఒకేలా ఉండదు. కొన్ని దశలు వేచి ఉండమంటాయి. కొన్ని పోరాడమంటాయి. మరికొన్ని వదిలేయమంటాయి. మన జీవితంలో వచ్చే దశలను మనం ఎంచుకోలేం. కానీ ఎలా జీవించాలో మాత్రం మనమే నిర్ణయించగలం అంటూ భావోద్వేగంగా రాసింది. సమంత ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా అభిమానుల సందేశాలతో నిండిపోయింది. ఆమె కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు పోస్టులను వైరల్ చేస్తున్నారు.
Also Read
- Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్
- King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
- Spider Man: భారత్‌లో 'స్పైడర్ మ్యాన్' సునామీ... రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
- Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న సమంతకు వృత్తిపరంగానూ మంచి సమయం కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ మూవీ మంచి విజయాన్ని అందుకుని, ఆమె కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో చిత్రంగా నిలిచింది. వ్యక్తిగత జీవితానికి వస్తే, 2021లో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం గత ఏడాది డిసెంబర్ 1న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట తమ రాబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.
Samantha Ruth Prabhu radiates elegance in her latest photos as the mom-to-be embraces a beautiful new chapter.
Dressed in a graceful mustard-yellow outfit, the actress looks absolutely radiant.#SamanthaRuthPrabhu #MomToBe #PregnancyGlow #CelebrityStyle #E24
Samantha Ruth… pic.twitter.com/bLs2xB6dxC
— E24 (@E24bollynews) August 2, 2026
తాజావార్తలు
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్‌తో సమంత ఫోటోలు వైరల్!
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్‌కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?