గురువారం లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఇప్పుడు నయన్ కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. 37 ఏళ్ళ నయన్ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో జరుపుకుంది. పురుషాధిక్యత ఉన్న చిత్ర పరిశ్రమలో అనుకున్నది సాధించి ముందడుగు వేస్తున్న నయన్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తనతో కలసి ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న సహనటీనటులు సమంత, విజయ్ సేతుపతి నయన్ బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. ఈ ఫంక్షన్ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది సమంత. సామ్ నయన్ ను విష్ చేయటమే కాకుండా అందంగా అభివర్ణించింది.
‘ఆమె వచ్చింది… చూసింది… ధైర్యం చేసింది… కలలు కన్నది… ప్రదర్శించి జయించింది!! హ్యాపీ బర్త్‌డే నయన్’ అని ప్రశంసలతో ముంచెత్తింది. విఘ్నేష్ శివన్ తీస్తున్న ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో సమంత, నయన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ రొమాంటిక్ కామెడీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారి. దీనిని నయన్ తో కలసి విఘ్నేష్ నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్
సంగీతం అందిస్తున్నాడు.