Site icon NTV Telugu

Samantha : సామ్ స్వీట్ నోట్… స్పందించని అఖిల్

samantha

samantha

టాలీవుడ్ స్టార్స్ సమంత, అక్కినేని నాగ చైతన్య విడిపోయి కొన్ని నెలలు గడుస్తోంది. ఇప్పటికీ వీరిద్దరూ ఏం చేసినా అది ఆసక్తికరంగానే మారుతోంది. అయితే సామ్ మాత్రం అక్కినేని కుటుంబంతో సన్నిహితంగానే ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది సామ్. ఏప్రిల్ 8న అక్కినేని అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అఖిల్ కు సామ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ స్వీట్ నోట్ షేర్ చేసింది. “హ్యాపీ బర్త్‌డే. ఈ సంవత్సరం మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే సామ్ పోస్ట్ కు అఖిల్ ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మరి అఖిల్ స్పందిస్తాడా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : Dil Raju : పూజా మన కాజా… అడుగు పెడితే హిట్టే !

ప్రస్తుతం అఖిల్ “ఏజెంట్” సినిమాలో నటిస్తుండగా, సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. సమంత విషయానికొస్తే… యశోద, శాకుంతలం, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

Akhil

Exit mobile version