లైఫ్ లో చాలా అనుకుంటాం.. కానీ అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది అనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా వివాహ బంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. ఇండస్ట్రీలో ఎంత త్వరగా రిలేషన్‌లో ఉంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇందులో సమంత నాగచైతన్య ఒకరు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట.. 2015లో డేటింగ్ ప్రారంభించి, 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అప్పటి నుండి సామ్ లైఫ్ టోటల్ గా చేంజ్ అయింది..
Also Read : Aaliyah : తల్లి, నటిగా, వ్యాపారవేత్తగా నా విజయం వెనుక రహస్యం అదే..
హెల్త్ ప్రాబ్లం రావడం.. ఇండస్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉండటం ఇలా దెబ్బ మీద దెబ్బ పడింది. ప్రజంట్ నిర్మాతగా మారి ఒకటి రెండు సినిమాలో నటిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.తన వ్యక్తిగత జీవితంపై ఓ ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా 20, 30 వయసులో తన అనుభవాలు, ప్రేమ, జీవన పాఠాలు, ఇప్పటి జీవన శైలి గురించి వివరించారు..
‘నిన్న రంభియా (మేకప్ ఆర్టిస్ట్)తో మాట్లాడిన మాటలు.. నన్ను ఆలోచింపజేసింది. ముప్పైల తర్వాత అంతా డౌన్ మాత్రమే అని ప్రపంచం చెబుతుంది. మీ మెరుపు మసకబారుతుంది, మీ అందం జారిపోతుంది. మీరు పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం కావాలని ఇరవైల్లో పరుగెత్తా. రెస్ట్ లేకుండా, తొందరపడుతూ గడిపా. ఎక్కువగా కనపడటానికి, తగినంతగా ఫీల్ కావడానికి తొందరపడ్డ. కానీ దాని ద్వారా నేను లోపల ఎంత కోల్పోయానో ఎవరూ చూడలేదు. అది ప్రేమ కాదు.. నిజమైన ప్రేమ ఎవరూ చెప్పలేదు. ప్రజంట్ నేను మొత్తం మారిపోయ్యాను. పరిగెత్తడం ఆపివేశాను’ అని సమంత ముగించింది.
