బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తనకంటూ ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి, సొంత టాలెంట్ తో అద్భుతమైన నటనతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. ప్రజంట్ భారీ చిత్రలో భాగం అవుతూ.. ఇటు ఫ్యామిలీ ఉమెన్ గా.. తల్లిగా.. వ్యాపారవేత్తగా బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవ్వని చూసుకోవాలి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్.. అందుకే ఎప్పుడూ ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ మరింత పెంచేసిందట. రీసెంట్‌గా ఆమె తన విజయ రహస్యం గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
Also Read : Saif Ali Khan : కెరీర్ స్ట్రగుల్స్‌పై ఓపెన్ అయిన సైఫ్ అలీ ఖాన్
అలియాకు పాడిల్ బాల్ గేమ్ అంటే ప్రాణం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ గేమ్ ఆడటం తన రొటీన్‌లో భాగమని చెబుతున్నారు. ఇది కేవలం వ్యాయామమే కాదు, తనకు ఆనందాన్ని కూడా ఇస్తుందని, అందుకే ఎప్పుడూ ఆడుతానని అన్నారు. తాజాగా అలియా తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో తాను పాడిల్ బాల్ ఆడుకున్న దృశ్యాలు కనిపించాయి. ఆ ఆటలో చూపిన ఫిట్‌నెస్, చురుకుదనం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ వీడియో తో పాటు అలియా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా షేర్ చేశారు.. “జీవితంలో మనం అనుకున్నది సాధించాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి. నేను ఆ వ్యాయామంలో వినోదాన్ని వెతుక్కుంటాను. అదే పాడిల్ బాల్ గేమ్. ఈ ఆట వల్లే నేను ఒక తల్లిగా, ఒక నటిగా, ఒక వ్యాపారవేత్తగా సమతౌల్యం సాధించి ముందుకు వెళ్తున్నాను” అని పేర్కొన్నారు.
ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు అలియాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇస్తున్నావు, నిజంగా ఇన్‌స్పిరేషన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తల్లి పాత్రలోని బాధ్యతలు, సినీ కెరీర్‌లోని ఒత్తిడి, వ్యాపారవేత్తగా తీసుకునే నిర్ణయాలు – ఇవన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో ఈ పాడిల్ బాల్ గేమ్ తనకు మానసిక, శారీరక శక్తి ఇస్తుందని అలియా భట్ చెబుతున్నారు.