టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకొంటుంది. తాజగా ఆమె రెండు ఫోటోలను షేర్ చేస్తూ తనకు కొత్తగా ప్రేమను పంచే వ్యక్తిని పరిచయం చేసింది.
సాయంసంధ్య వేళ బీచ్ ఒడ్డున స్నేహితురాలు మేఘన తో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ‘నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను
‘ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈ ఫొటోకు బెస్ట్ ప్రెండ్స్ సిస్టర్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ లని జత చేసింది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలను, ఆనందాలను పంచుకోవడానికి ఫ్రెండ్ ఉండాలి అంటారు.. విడాకుల తరువాత సామ్ ఉన్న పరిస్థితిలో ఆమెకు తోడుగా నిలిచింది ఈ స్నేహితులే..అలాంటి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే .. సామ్ నువ్వు త్వరగా కోలుకోవాలి.. అని నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే సామ్ ప్రస్తుతం యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది.