Site icon NTV Telugu

ఊ అంటావా.. ఊహూ అంటావా’.. ‘పుష్ప’ లో హీట్ పెంచే సమంత ఐటమ్

pushpa

pushpa

సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడట.
ఈ పాటలో స్టార్ హీరోయిన్ సమంత బన్నీతో కలసి స్టెప్పేయటం మరింత విశేషం. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఐటమ్ సాంగ్ చేయటం… అదీ బన్నీలాంటి ఎనర్జిటిక్ స్టార్ తో సుకుమార్, దేవీ కాంబోలో కావటంతో మొత్తం టాలీవుడ్ కళ్ళన్నీ ఈ పాటపైనే ఉన్నాయటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ‘పుష్ప’ నుంచి విడుదలైన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా మారాయి. ఇప్పుడు ఈ ఐటమ్ తో యూట్యూబ్ షేక్ అవటం ఖాయం అంటున్నారు.

ఇటీవల ఈ పాటను ఫిల్మ్ సిటీలో భారీగా వేసిన సెట్ లో అల్లుఅర్జున్, సమంతపై చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించి సమంత ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘ఊ అంటావా… ఊహూ అంటావా’ అనే పల్లవితో ఈ పాట సాగనుందట. ఇంతకు ముందు వచ్చిన సుకుమార్, దేవి ఐటమ్ సాంగ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని సెట్స్ లో పని చేసిన వారి మాట. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6వ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ లోనే సామ్ ఐటెం సాంగ్ ని కూడా చూపించనున్నారట. అలాగే 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్. ఇప్పటికే బాలయ్య ‘అఖండ’ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. మరి ‘పుష్ప’ ఆ సక్సెస్ సాగాను మరింత భారీ స్థాయిలో ముందుకు తీసుకువెళుతుందని భావిద్దాం.

Exit mobile version