Samantha : జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత తన నటనతో అందరిని మెప్పించి తెలుగు లో టాప్ హీరోయిన్ అయింది.ఇక తన కెరియర్ లో చాలా హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ఇండియా లో కూడా తన ప్రతిభని చాటింది.. అందుకే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటడెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హిందీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తుంది.ఇంతటి పాపులారిటీ సమంత కు అంత ఈజీగా అయితే ఏం రాలేదు మరి. ప్రతి పాత్ర కోసం సమంత ఎంతో కష్టపడింది. ముఖ్యంగా తన అందం కోసం అలాగే ఫిట్ నెస్ కోసం సమంత ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఫిట్ గా ఉంటడానికి సమంత ఎంతో కష్టపడుతుంది. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటుంది. అయితే సాధారణంగా హీరోయిన్లంతా నార్మల్ గా కార్డియో లాంటి కసరత్తులను చేస్తే సమంత మాత్రం వెయిట్ లిఫ్టింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ను ఇస్తుంది. అలా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల బాడీకి స్టామినా వస్తుందని చెప్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పలుమార్లు జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఫొటోలు పోస్టు చేసిన విషయం తెలిసిందే.
గతంలో ఏకంగా 100 కిలోల బరువును అవలీలగా ఎత్తింది. ఆ వీడియో అప్పట్లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక తరచూ తను జిమ్ లో కసరత్తు చేస్తూ ఫొటోలు ను పెడుతూ ఉంటుంది. మయోసైటిస్ తో బాధ పడుతున్నప్పుడు కూడా సమంత తన ఫిట్ నెస్ ట్రైనింగ్ మాత్రం అస్సలు వదల్లేదు. ఇంకా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుని మరీ త్వరగా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంది. అయితే సమంత లేటెస్ట్ గా జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫొటోను పంచుకుంది. ఈ ఫొటోలో సమంత తన ట్రైనర్ తో కలిసి పోజులిచ్చింది. తన కండలు చూపిస్తూ ఫొటో ను దిగింది. ఈ ఫొటోలో సమంత కండలు చూస్తుంటే.. ఈ మాత్రం ఫిట్ నెస్ రావడానికి ఈ బ్యూటీ ఎంత కష్టపడిందో అని అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత లేటెస్ట్ ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి సమంత ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అంత బిజీ షెడ్యూల్ లో కూడా జిమ్ చేస్తూ సమంత ఇన్స్పైర్ చేస్తోందని కామెంట్లు కూడా వినపడుతున్నాయి.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Tags
- #hard work
- Samantha
- Workout
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!