Samantha : సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఈ మధ్య బాగా కలిసి తిరుగుతోంది. కానీ తమ మధ్య ఏం ఉందో అస్సలు బయట పెట్టట్లేదు. ముఖ్యంగా చైతూ-శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత వీరిద్దరూ ఇలా రెచ్చిపోతున్నారు. రాజ్‌తో క్లోజ్‌గా కనిపిస్తోంది. తరచూ ఇద్దరూ ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. అంతే కాకుండా రెస్టారెంట్లు, పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎన్ని ట్రోల్స్, వార్తలు వస్తున్నా సరే ఇద్దరు మాత్రం బయటకు ఏమీ చెప్పట్లేదు.
Read Also : Chiranjeevi- Ram Charan : చిరుకు కలిసొచ్చింది.. చరణ్ కు ఎదురుదెబ్బ.. రూట్ మార్చారా..?
ఇక తాజాగా తన పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో సమంత దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా రాజ్ నిడుమోరుకు టైట్ హగ్ ఇచ్చింది సమంత. ఇందుకు సంబంధించిన ఫొటోను చూసిన వారంతా.. మీ రిలేషన్ ను కన్ఫర్మ్ చేసేస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా అందరికీ హింట్ ఇస్తోందని చెబుతున్నారు. సమంత పంచుకున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Also : Peddi : చికిరి పాటపై చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. మిక్స్ డ్ టాక్
