Site icon NTV Telugu

Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్

Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్న అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత. ఇన్‌స్టాగ్రామ్‌ సమంత ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను పోస్ట్ చేస్తో “ఇంకో అర్థరాత్రి విమానం … కాదు!! ఈ రాత్రికి రిథమ్ #హలమితిహబీబో… #బీస్ట్ ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తుండడంతో వైరల్ అవుతోంది.

Read Also : Chor Bazaar : దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ… టైటిల్ సాంగ్

తలపతి విజయ్, పూజా హెగ్డే నటించిన “బీస్ట్” మొదటి పాట ‘అరబిక్ కుతు’ ప్రేమికుల రోజున విడుదలైంది. అప్పటి నుంచి ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో తుఫానును సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన “అరబిక్ కుతు” పాటను అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ పాడారు. ఈ పాటకు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ను అరబిక్ సంగీతం, తమిళ కుతు బీట్‌ల కలయికతో రూపొందించారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, తలపతి విజయ్ మొదటిసారిగా బీస్ట్‌లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ మూవీతో దాదాపు దశాబ్దం తర్వాత పూజా హెగ్డే తమిళ చిత్రసీమలోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతోంది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Exit mobile version