ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. తన హెల్త్ గురించి రెగ్యులర్ గా సమంతా అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఆమెని చూడకపోవడంతో ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ‘మాయోసైటస్’ కారణంగానే ‘సిటడెల్’ వెబ్ సిరీస్ (Citadel) నుంచి కూడా సమంతా తప్పుకుందనే రూమర్స్ వినిపించాయి. అయితే అదేమీ లేదని జనవరి మూడో వారం నుంచి కమిట్ అయిన ప్రతి ప్రాజెక్ట్ షూటింగ్ లో సమంతా పాల్గొంటుందని సమంతా టీం క్లారిటీ ఇచ్చారు. అయితే సమంతా పబ్లిక్ అప్పిరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చెయ్యడంతో సామ్ ని ఫాన్స్ మిస్ అవుతున్నారు.
Read Also: Spy Universe: ఆ రావాలమ్మా రావాలి… ‘స్పై’లు ఎక్కడ ఉన్నా రావాలి…
గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ అజ్ఞాతంలో ఉన్న సమంతా ముంబై ఎయిర్పోర్ట్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. గత కొన్ని నెలల్లో సమంతా పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి, దీంతో పాపరాజ్జి సామ్ ఫోటోస్ ని క్లిక్ చేశాయి. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంతాని చాలా రోజుల తర్వాత చూసిన ఫాన్స్ హ్యాపీగా ఫెల్ అయ్యారు. జనవరి 9న హైదరాబాద్ లో జరగనున్న ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా ఫాన్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వనుంది. ఏడాది కాలంలో సమంతా ఫాన్స్ ని మీట్ అవ్వడం ఇదే మొదటిసారి. సమంతా ఫాన్స్ ఆమెని చూడడానికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఎక్కువ సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. మరి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ సామ్ ఎమోషనల్ అవుతుందేమో చూడాలి.
Read Also: Veera Simha Reddy: జై బాలయ్య డైలాగ్ కి ఊగిపోతున్న సోషల్ మీడియా