Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత

Raj Nidimoru Samantha

Raj Nidimoru Samantha

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తాజాగా ఎన్టీవీకీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో సమంతతో పాటు ఆమె భర్త/నిర్మాత రాజ్ నిడిమోరు డైరెక్టర్ నందినీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “ఇప్పుడు నేనేమీ ఒంటరిగా కూర్చోలేదు, నేను ఒంటరిదాన్ని కాదు. నా పక్కన దిగ్గజాల్లాంటి (Giants) వ్యక్తులు ఉన్నారని నేను భావిస్తున్నాను. నా ప్రతీ అడుగులో, నా ప్రయాణంలో ప్రతి క్షణం వారు నాకు అండగా నిలబడుతున్నారు, పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. అంతటి అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ నా వెనుక ఉంది” అంటూ తన వెనుక నిలిచిన శ్రేయోభిలాషులను, టీమ్‌ను సామ్ కొనియాడారు.

తన ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. “నా కెరీర్‌లో నిర్మాతగా కేవలం రెండో సినిమాతోనే ఇంతటి భారీ, అద్భుతమైన స్టోరీ ఉన్న చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను మేము నిర్మిస్తున్నందుకు మా టీమ్ అంతా ఇప్పటికే ఎంతో గర్వపడుతోంది. ఇంతటి అద్భుతమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది” అని సమంత ఆనందం వ్యక్తం చేశారు. నటిగా బిజీగా ఉంటూనే, ఒక విభిన్నమైన సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పరచుకుని ప్రొడక్షన్‌లో సమంత వేస్తున్న ఈ అడుగులు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్నాయి.

×
×
Ad