Samantha : డస్కీబ్యూటీ సమంత ఎన్టీఆర్ తో సినిమాను వదలుకుంది. గతంలో ఎన్టీఆర్ తో కలసి ‘జనతా గ్యారేజ్’లో నటించింది సమంత. దానికి దర్శకుడు కూడా కొరటాల శివనే. ఇప్పుడు కొరటాల మరోసారి ఎన్టీఆర్, సమంత జోడీని సెట్ చేయాలని భావించాడు. అయితే అది సాధ్యపడలేదని టాక్. దానికి కారణం సమత పారితోషికమేనట. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఫుల్ బిజీ అయింది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా’ పాటతో మరింత క్రేజ్ పెంచుకుంది సమంత. ఆ తర్వాత పలువురు సమంత కోసం క్యూ కట్టినా సెలక్టీవ్ గా వెళుతోంది సమంత. ఇక ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే సమంత ఈ సినిమాను పారితోషికం కారణంగా వదులుకున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్టా.
ఈ సినిమాలో పాత్ర కోసం కొరటాల సమంతకి రెండున్నర కోట్లు ఆఫర్ చేశారట. అయితే సమంత నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్లకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉండవు. అంతా హీరో మీదనే ఉంటుంది. అందుకే కొరటాలతో పాటు నిర్మాత కళ్యాణ్ రామ్ అంత పారితోషికం ఇవ్వడం వ్యర్ధమని భావించి ఉండవచ్చు. నిజానికి కరోనా తర్వాత టాలీవుడ్ లో టాప్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా పారితోషికాలను భారీగా పెంచేశారు. పూజా హెగ్డే, రష్మిక వంటి టాప్ హీరోయిన్లు కూడా 4 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు వినికిడి. ఇక కియారా అద్వాని అయితే 5 కోట్లు అడుగుతోందట. అందుకే సమంత 4 కోట్లు అడిగి ఉండవచ్చని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో కలసి కొరటాల సినిమాలో సందడి చేసే తార ఎవరో? అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.