Samantha: దర్శకుడు రాజ్‌తో ప్రేమ ప్రచారం.. ముంబైలో అలా కనిపించిన సమంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Appeared at Mumbai: నటి సమంత మాజీ భర్త నాగ చైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనను ఎక్కువగా ఫాలో అవుతోంది. మరో పక్క సమంత దర్శకుడు రాజ్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. అక్టోబర్ 2021లో పరస్పర విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో సంయుక్తంగా ప్రకటించారు. అప్పటి నుంచి సమంత సింగిల్ స్టేటస్‌ను కొనసాగిస్తోంది. నాగ చైతన్య ఇటీవల నటి శోభిత ధూళిపాళతో ప్రేమాయణం పుకార్ల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన వారం రోజుల్లోనే సమంత కూడా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు-సమంతలు డేటింగ్‌లో ఉన్నారనేది లేటెస్ట్ హాట్ న్యూస్.
Duvvada Vani: దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా నాకు అనవసరం..
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
బాలీవుడ్‌లో ఈ రూమర్ దావానంలా వ్యాపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ మొదలైన విజయవంతమైన సీరిస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ – డికె భారతదేశం అంతటా ప్రజాదరణ పొందారు. రాజ్ – డికె తెలుగు వారు మరియు సమంతా వారిలో ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. రాజ్, డీకే దర్శకత్వంలో సమంత మరో సిరీస్ చేస్తోంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ హిందీ వెర్షన్ హనీ బన్నీ పేరుతో ఈ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హనీ బన్నీ నవంబర్ 7న ప్రైమ్‌లో ప్రసారం కానుంది. షూటింగ్‌లో భాగంగా కొన్ని రోజులుగా రాజ్-సమంత కలిసి కనిపిస్తున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారిందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ రూమర్ నేపధ్యంలో సమంత ముంబైలో ప్రత్యక్షమవగా సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజ్‌తో తనకు సంబంధం ఉందనే పుకార్లపై సమంతా స్పందించలేదు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!