Samantha and Ranveer Singh feature in vicks vaporub commercial Ad: సమంత ఇంతవరకూ ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు కానీ, ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్ పుణ్యమా అని బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఫలితంగా అమ్మడు పాన్ ఇండియా నటిగా అవతరించింది. ఇంకేముంది.. క్రేజీ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇటు సౌత్‌లో బోలెడన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. హిందీలోనూ ప్రాజెక్టులు ఒప్పుకుంటోంది. ఒక సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా చర్చలు కొనసాగిస్తోంది.
అయితే.. ఈలోపే ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించింది. విక్స్ వేపరబ్ యాడ్‌లో సమంత ట్రాఫిక్ పోలీస్ అధికారిగా కనిపించగా.. రణ్‌వీర్ సింగ్ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే బైకర్‌గా నటించాడు. తలనొప్పి, ముక్క దిబ్బడ సమస్యలతో బాధపడుతున్న అతడు.. ట్రాఫిక్ సిగ్నల్‌ని గమనించకుండా దాటేస్తాడు. అక్కడే ఉన్న సమంత అతడ్ని అడ్డుకుంటుంది. తనకున్న సమస్యల కారణంగా సిగ్నల్ గమనించలేదని హీరో చెప్తే.. అమ్మడు వెంటనే ‘విక్స్ రోల్-ఆన్ ఇన్‌హేలర్’ తీసి, ఇది రాసుకో అంటూ ఒక చిన్న క్లాస్ పీకుతుంది.
ముక్కు దిబ్బడకు ఇన్‌హేలర్, తలనొప్పికి రోల్-ఆన్‌కి చెక్ పెట్టే 2 ఇన్ 1 సౌకర్యం కలిగి ఉందని చెప్తుంది. అది రాసుకోగానే, దెబ్బకు హీరో సెట్ అయిపోతాడు. ఈ యాడ్ కోసం సమంత ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇద్దరు స్టార్స్ కలిసి నటించడంతో.. ఈ యాడ్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.