Site icon NTV Telugu

Ulaganayagan : 25 ఏళ్ల క్రితం ఆగిపోయిన ప్రాజెక్ట్‌కు మోక్షం

Kamal Hassan

Kamal Hassan

కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్‌ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు.

Also Read : Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఖరారు

భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 1997లో కమల్ హాసన్ స్వీయ దర్వకత్వంలో మరుదనాయగం అనే ఫిల్మ్ తెరకెక్కించాలనుకున్నారు. భారీ బడ్జెట్.. స్టార్ట్ కాస్ట్‌ కూడా ఫిక్స్ చేశారు. బ్రిటీష్- ఫ్రెంచ్-ఇండియన్ జాయింట్ వెంచర్‌గా కూడా ప్రకటించారు. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అప్పట్లోనే రూ. 80 కోట్లతో తెరకెక్కించాలనుకున్నారు లోక నాయకుడు. 18వ శతాబ్దపు యోధుడు మహ్మాద్ యూసఫ్ అలియాస్ మరుదనాయగం స్టోరీని వెండితెరపై చూపించాలనుకున్నారు కమల్.  మరుదనాయగం ఓపెనింగ్‌కు బ్రిటీష్ రాణి క్వీన్ ఎలిజిబెత్2తో పాటు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిథి  ఇతర సినీ పెద్దలు విచ్చేశారు. అలాగే కన్నడ స్టార్ విష్ణు వర్థన్, నసీరుద్దీన్ షా, సత్యరాజ్, అమ్రీష్ పురి, నాజర్ లాంటి స్టార్స్ ఫిక్స్ చేశారు.

Also Read : Keerthy Suresh : మహానటి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు

అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ క్యామియో అప్పీరియన్స్‌తో ఇప్పించాలనుకన్నారు. టైటానిక్ ఫేం కేట్ విన్స్లేట్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగి ఉంటే కమల్ అండ్ సౌత్ ఇండస్ట్రీ రేంజ్ మరోలా ఉండేదేమో? కానీ కొంత షూటింగ్ జరిగాక కమల్‌కు హ్యాండిచింది బ్రిటీష్ ప్రొడక్షన్ హౌస్. అప్పట్లో ఉన్న సినిమా టికెట్ ధరలకు బడ్జెట్ రికవర్ కావడం కష్టమని వైదొలిగింది. బ్రిటీష్ కంపెనీ వెళ్లిపోయినప్పటికీ కమల్ మూవీ తెరకెక్కించేందుకు ట్రై చేశారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేక 1999లో చేతులెత్తేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు కమల్. రీసెంట్లీ గోవా ఇఫీ వేడుకలకు హాజరైన ఉళగనాయగన్. మరుదనాయగాన్ని ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి తీయడం సాధ్యమే అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Exit mobile version