Site icon NTV Telugu

Salman Khan: సోషల్ మీడియాని 48 గంటల ముందే కబ్జా చేసిన టైగర్ ఫ్యాన్స్

Tiger 3

Tiger 3

పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలుగా బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసాయి. జవాన్ 1100 కోట్లు దాటినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తాడా లేక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వచ్చి చేరుతాడా అనేది నవంబర్ 10న తెలియనుంది. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్ గా పేరు తెచ్చుకున్న టైగర్ సీరీస్ నుంచి వస్తున్న థర్డ్ సినిమా ‘టైగర్ 3’. ఈ మూవీ నవంబర్ 10న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్… బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని వదులుతూనే ఉన్నారు. ఈ పోస్టర్స్ తోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సల్మాన్ అభిమానుల జోష్ ని ఆకాశానికి తీసుకోని వెళ్లడానికి, టైగర్ 3 రేంజ్ ఏంటో చూపించడానికి ట్రైలర్ రాబోతుంది.

సల్మాన్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న టైగర్ 3 ట్రైలర్ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ అవుతుండడంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని 48 గంటల ముందే హైజాక్ చేసారు. టైగర్ 3, సల్మాన్ ఖాన్, టైగర్ 3 ట్రైలర్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తూ నెట్ లో హల్చల్ చేస్తున్నారు సల్మాన్ ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా టైగర్ 3 ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. టైగర్ 3 ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ ని రివీల్ చేస్తారా లేదా అని కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సల్మాన్ షారుఖ్ ఫ్యాన్స్ తోడైతే చాలు ట్రైలర్ రిలీజ్ అవ్వడం ఆలస్యం డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యి కొత్త హిస్టరీ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ.

Exit mobile version