Sikandar: సల్లు భాయ్ తో మురగదాస్.. ఇట్స్ అఫీషియల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏడాది రంజాన్ రోజు సల్మాన్ ఖాన్ ఒక సినిమా రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం సినిమా రిలీజ్ చేసే విషయంలో వెనకడుగు వేశాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం రంజాన్ కి ఒక సినిమా దింపబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. నిజానికి కొన్నాళ్ల నుంచి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తాడు అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సల్మాన్ ఖాన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మురగదాస్ దర్శకత్వంలో తన సికిందర్ అనే సినిమా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది ఈద్ అదేనండి రంజాన్ కి తమ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన ప్రకటించారు.
Also Read; Manjummal Boys: ఇండస్ట్రీ హిట్ సినిమాకి పివిఆర్ ఐనాక్స్ షాక్.. ఎమర్జెన్సీ మీటింగ్!
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అంతే కాదు ఈ ఏడాది రంజాన్ ని బడే మియాన్ చోటా మియాన్ సినిమాతో పాటు మైదాన్ సినిమాతో జరుపుకోవాలని వచ్చే ఏడాది పండుగ మాత్రం తమ సికిందర్ సినిమాతో జరుపుకోవాలని ఆయన ఇంస్టాగ్రామ్ లో ఈ మేరకు పోస్ట్ చేశాడు. ‘కిక్’, ‘జుడ్వా’ మరియు ‘ముజ్సే షాదీ కరోగి’ వంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సల్మాన్ ఖాన్ అలాగే సాజిద్ నడియాడ్వాలా మళ్లీ కలిసి ఈ సికిందర్ అనే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏఆర్ మురుగదాస్ హిందీలో ‘గజిని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు దాటేశాడు. అక్షయ్ కుమార్ నటించిన ‘హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ డ్యూటీ’కి కూడా దర్శకుడుగా వ్యవహరించారు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ఆయన చివరిగా టైగర్ 3 అనే సినిమాలో కనిపించాడు. ఆ సినిమా ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయింది.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..