Site icon NTV Telugu

Sikandar: సల్లు భాయ్ తో మురగదాస్.. ఇట్స్ అఫీషియల్

Sm

Sm

ప్రతి ఏడాది రంజాన్ రోజు సల్మాన్ ఖాన్ ఒక సినిమా రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం సినిమా రిలీజ్ చేసే విషయంలో వెనకడుగు వేశాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం రంజాన్ కి ఒక సినిమా దింపబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. నిజానికి కొన్నాళ్ల నుంచి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తాడు అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సల్మాన్ ఖాన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మురగదాస్ దర్శకత్వంలో తన సికిందర్ అనే సినిమా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది ఈద్ అదేనండి రంజాన్ కి తమ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన ప్రకటించారు.

Also Read; Manjummal Boys: ఇండస్ట్రీ హిట్ సినిమాకి పివిఆర్ ఐనాక్స్ షాక్.. ఎమర్జెన్సీ మీటింగ్!

అంతే కాదు ఈ ఏడాది రంజాన్ ని బడే మియాన్ చోటా మియాన్ సినిమాతో పాటు మైదాన్ సినిమాతో జరుపుకోవాలని వచ్చే ఏడాది పండుగ మాత్రం తమ సికిందర్ సినిమాతో జరుపుకోవాలని ఆయన ఇంస్టాగ్రామ్ లో ఈ మేరకు పోస్ట్ చేశాడు. ‘కిక్’, ‘జుడ్వా’ మరియు ‘ముజ్సే షాదీ కరోగి’ వంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సల్మాన్ ఖాన్ అలాగే సాజిద్ నడియాడ్‌వాలా మళ్లీ కలిసి ఈ సికిందర్ అనే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏఆర్ మురుగదాస్ హిందీలో ‘గజిని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు దాటేశాడు. అక్షయ్ కుమార్ నటించిన ‘హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ డ్యూటీ’కి కూడా దర్శకుడుగా వ్యవహరించారు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ఆయన చివరిగా టైగర్ 3 అనే సినిమాలో కనిపించాడు. ఆ సినిమా ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయింది.

Exit mobile version