Tiger 3: నాకు, కత్రినాకు ఈ దీపావళి ప్రత్యేకం అంటున్న సల్మాన్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan says this deepavali will be most special one: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది ఇప్పటి వరకు దీపావళి టైంలో రిలీజ్ కాలేదు. అయితే తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ దీపావళి పండుగకి సినిమా రిలీజ్ కావడం అనేది ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఆ రోజుల్లో విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకుల ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారని అన్నారు. అలా దీపావళి రోజు విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయని, అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకం, ఎందుకంటే ఇప్పటి వరకు మేం కలిసి నటించిన ఏ సినిమా కూడా దీపావళికి రిలీజ్ కాలేదని అన్నారు. తొలిసారి ‘టైగర్ 3’ రిలీజ్ కానుంది కాబట్టి మేం ఎంతో ఆనందంతో, ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నామని అన్నారు.
Geetha Shankaram: గుప్పెడంత మనసు ముఖేష్‌గౌడ హీరోగా ‘గీతా శంకరం’.. ఫస్ట్‌లుక్ లాంచ్
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
దీపావళి అంటే వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా ఒక చోటికి చేరుతాయని, నాకు కావాల్సిన వారితో దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఇష్టపడతా, అలాగే నా కుటుంబ సభ్యులందరితో కలిసి టైగర్ 3 సినిమాను చూస్తానని అన్నారు. అందరూ ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతారని భావిస్తున్నానన్నారు సల్మాన్. ఇక కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగ అంటే అందరికీ ప్రత్యేకమైనది, అయితే ఈ ఏడాది నాకు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే నేను, సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ రిలీజ్ అవుతుంది, చెడుపై మంచి ఎలా విజయం సాధించిందనే విషయాన్ని ఇందులో చూపించాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి రోజునే టైగర్ 3 రిలీజ్ కావడం ఆనందంగా ఉంది, నేను, సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లో తొలిసారి దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమా ఇది. కచ్చితంగా మేం ప్రేక్షకులను మెప్పిస్తాం. ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని, ఎగ్జయిట్‌మెంట్‌ను అందిస్తాం అన్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!