Salman Khan: సల్మాన్ కొత్త సినిమా టైటిల్ మారింది.. ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ కోసం ఆయన అభిమానులు గత కొంతకాలంగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఈ సినిమా టైటిల్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ అపూర్వ లఖియాతో కలిసి సల్మాన్ ఖాన్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఇప్పుడు ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ (Matrubhoomi: May War Rest In Peace) అనే పేరును ఖరారు చేశారు. మార్చి 16న సల్మాన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త టైటిల్ మరియు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. హఠాత్తుగా పేరు మార్చడానికి గల కారణంపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ అనే పేరు కేవలం ఒక నిర్దిష్టమైన సంఘటనకు లేదా ఒక చిన్న పరిధికి పరిమితమైనట్లుగా అనిపిస్తోందని చిత్ర బృందం భావించిందట.
Also Read:Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
ఈ సినిమా కథ కేవలం ఒక యుద్ధానికే పరిమితం కాకుండా, దేశభక్తిని ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున ఉంటుందని, అందుకే టైటిల్ కూడా గంభీరంగా ఉండాలని సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మాతృభూమి’ అనే పేరు కథలోని లోతును మరియు ఆ గంభీరతను స్పష్టంగా చూపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. టైటిల్ క్లారిటీ వచ్చింది కానీ, రిలీజ్ విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజాగా విడుదలైన ‘మాతృభూమి’ పోస్టర్‌పై ఎక్కడా రిలీజ్ డేట్ ప్రస్తావించలేదు. దీనివల్ల సినిమా వాయిదా పడి ఉండవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ సస్పెన్స్‌కు తెరపడదు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!