Site icon NTV Telugu

Salman Khan: సల్మాన్ కొత్త సినిమా టైటిల్ మారింది.. ఏంటో తెలుసా?

Maatrubhumi

Maatrubhumi

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ కోసం ఆయన అభిమానులు గత కొంతకాలంగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఈ సినిమా టైటిల్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ అపూర్వ లఖియాతో కలిసి సల్మాన్ ఖాన్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఇప్పుడు ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ (Matrubhoomi: May War Rest In Peace) అనే పేరును ఖరారు చేశారు. మార్చి 16న సల్మాన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త టైటిల్ మరియు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. హఠాత్తుగా పేరు మార్చడానికి గల కారణంపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ అనే పేరు కేవలం ఒక నిర్దిష్టమైన సంఘటనకు లేదా ఒక చిన్న పరిధికి పరిమితమైనట్లుగా అనిపిస్తోందని చిత్ర బృందం భావించిందట.

Also Read:Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?

ఈ సినిమా కథ కేవలం ఒక యుద్ధానికే పరిమితం కాకుండా, దేశభక్తిని ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున ఉంటుందని, అందుకే టైటిల్ కూడా గంభీరంగా ఉండాలని సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మాతృభూమి’ అనే పేరు కథలోని లోతును మరియు ఆ గంభీరతను స్పష్టంగా చూపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. టైటిల్ క్లారిటీ వచ్చింది కానీ, రిలీజ్ విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజాగా విడుదలైన ‘మాతృభూమి’ పోస్టర్‌పై ఎక్కడా రిలీజ్ డేట్ ప్రస్తావించలేదు. దీనివల్ల సినిమా వాయిదా పడి ఉండవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ సస్పెన్స్‌కు తెరపడదు.

Exit mobile version