Salman Khan House Firing Case Latest Update: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు సాగర్ పాల్, విక్కీ గుప్తా పోలీసుల అదుపులో ఉన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా బీహార్ వెళ్లి నిందితుల కుటుంబాల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపేందుకు నిందితులకు లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్లు ఈ కేసులో ఇప్పుడు వెల్లడైంది. పోలీసు మూలాల ప్రకారం, సాగర్ పాల్ మరియు అతని భాగస్వామి విక్కీ గుప్తా ఇద్దరూ షూటింగ్ చేయడానికి ₹ 4 లక్షలు ఆఫర్ చేసినట్లు NDTV రిపోర్ట్ చేసింది. ఇందులో ₹ 1 లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారని, పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బు చెల్లిస్తామని ఇద్దరికీ హామీ ఇచ్చారని తెలిసింది. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను గుజరాత్‌లోని కచ్ జిల్లా మాతా నో మద్ గ్రామం నుంచి సోమవారం అర్థరాత్రి అరెస్టు చేసి, అనంతరం ముంబైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Screen Writer Passed Away: ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
డబ్బు కోసమే కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరపడానికి ముందు నటుడి ఇంటి చుట్టూ మూడుసార్లు రెక్కీ నిర్వహించాడని, ఈద్ రోజు కూడా వారు అక్కడ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీనియర్ గుజరాత్ పోలీసు అధికారి ప్రకారం, జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపే పనిని విక్కీ గుప్తా మరియు సాగర్ పాల్‌కు అప్పగించారు. ఆదివారం, ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పులు జరిపి పారిపోయారని తెలిసిందే. ఈ క్రమంలో 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కుటుంబం షాక్‌కు గురైంది. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం సల్మాన్ ఖాన్‌ను ఆయన ఇంట్లో కలిశారు. ఈ సమయంలో, సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కూడా ఉన్నారు.