Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘రంగ్ దే బసంతి’ వంటి క్లాసిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించనున్న ‘కర్ణ’ సినిమాలో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. దాదాపు ఐదేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆఫీషియల్ గా లాక్ కావడంతో బాలీవుడ్లో ఒక్కసారిగా ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రముఖ సినీ పత్రిక ఫిల్మ్‌ఫేర్ ఈ కాంబినేషన్ లాక్ అయిందని, సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఆఫీషియల్ గా ధృవీకరించింది. జూన్‌లోనే రాకేష్ మెహ్రా సల్మాన్‌కు కథ వినిపించగా, స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో చాలాకాలంగా చర్చల్లో ఉన్న ‘కర్ణ’ సినిమా ఇప్పుడు ముందుకు కదిలింది.
మహాభారతంలోని అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటైన కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కనుంది. కర్ణుడి దాతృత్వం, అస్త్రవిద్యతో పాటు అతని జీవితంలో ఎదురైన సంఘర్షణలను కథలో చూపించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తన కెరీర్లో తొలిసారి ఇలాంటి మైథలాజికల్ పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాపై బజ్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. ‘కర్ణ’ను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో విజువల్స్ ఉండేలా భారీ ప్రీ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులను ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2027 ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు రాకేష్ మెహ్రా విక్రాంత్ మాస్సేతో ఒక చిన్న లవ్‌స్టోరీని పూర్తి చేయనున్నారు. మరోవైపు ‘కర్ణ’ కోసం అవసరమైన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కర్ణుడి పాత్ర కోసం సల్మాన్ ఖాన్ లుక్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అయితే హీరోయిన్, మిగతా నటీనటులు వంటి అంశాలపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐదేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో సల్మాన్ అభిమానుల్లోనూ, సినీ వర్గాలలోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై పెద్ద ఎత్తునే చర్చించు కుంటున్నారు.
- Tags
- cinema
- Salman Khan
తాజావార్తలు
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!