Site icon NTV Telugu

Salaar: రాసిపెట్టుకోండి.. ‘సలార్’ 2000 కోట్లు పక్కా!

Prabhas

Prabhas

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ సినిమాల నష్టాలను పూడ్చేందుకు… ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చేందుకు… ఈ సినిమా ఒక్కటి చాలు అనేలా థియేటర్లోకి రాబోతోంది సలార్. అసలు సలార్ బడ్జెట్‌కు వసూళ్లకు పదింతల తేడా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సినిమాలో నటించిన నటీ నటులు. తాజాగా.. కమెడియన్ సప్తగిరి, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 2 వేల కోట్లు వసూళ్లు చేస్తుందని చెప్పుకొచ్చాడు. సలార్ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన జోష్‌లో సప్తగిరి ఈ ట్వీట్ చేశాడు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది, బాక్సాఫీస్ దగ్గర 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌, హోంబలే ఫిలింస్‌కి థాంక్స్‌…’ అని సప్తగిరి ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లోనే 100 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇక టీజ‌ర్‌కు మించి ట్రైల‌ర్ ఉంటుంద‌ని మేకర్స్ ప్రకటించడంతో.. సలార్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. దానికి మరింత బూస్టింగ్ ఇచ్చేలా సప్తగిరి ఇచ్చిన హైప్ వేరే లెవల్లో ఉంది. అందుకే సలార్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులతో పాటు, మ్యూజిక్ వర్క్స్‌తో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నైలో సంగీత దర్శకుడు రవి బసృర్ సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్ పనులు చేస్తున్నారట. మరి ఇంత హైప్‌తో వస్తున్న సలార్.. సెప్టెంబర్ 28న ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version