Site icon NTV Telugu

Prabhas: యుద్ధానికి సిద్ధమవ్వండి… డైనోసర్ ట్రైలర్ వస్తుంది

Salaar

Salaar

ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండేవి. మరో వారంలో డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేది కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు. అటు ప్రశాంత్ నీల్ కానీ, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వారు గానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం… సలార్ సినిమా నవంబర్, డిసెంబర్‌ లేదా జనవరిలో ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే… అక్టోబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ప్రభాస్ బర్త్ డే ఉంది., కాబట్టి ఆరోజే సలార్ కొత్త రిలీజ్ డేట్ పై అఫిషీయల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… అక్టోబర్ 23న సలార్ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజులు వినిపించిన డేట్స్ అన్ని రూమర్సే అయినా ఈసారి మాత్రం ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా సలార్ ట్రైలర్ రావడం గ్యారెంటీ. అదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ ఉండనుంది. మామూలుగానే ఆ రోజు ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. దానికి తోడుగా డైనోసర్ ట్రైలర్ ఎటాక్ చేస్తే.. సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ. ఇప్పటి నుంచే అక్టోబర్ 23 కోసం కౌంట్‌ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. మరి టీజర్‌తో డిజిటల్ రికార్డ్స్‌ని చెల్లా చెదురు చేసిన సలార్.. ట్రైలర్‌తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version