సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమాలో కన్నడగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారాడు. సలార్ సినిమాకి ఉగ్రమ్ సినిమాకి పోలికలు ఉంటాయనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇటీవలే రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ బయటకి వచ్చిన తర్వాత ఆ డిస్కషన్ మరింత పెరిగింది. సలార్, ఉగ్రమ్ సినిమాకి రీమేక్ వర్షన్… స్కేల్ పెంచి అదే కథని పాన్ ఇండియా రేంజులో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్ అనే కామెంట్స్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో కూడా ఇది ఇద్దరు స్నేహితుల కథగా ప్రెజెంట్ చేయడంతో సలార్ రీమేక్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఈ కారణంగానే కన్నడ మూవీ లవర్స్, ఉగ్రమ్ మూవీ లవర్స్, శ్రీ మురళి ఫ్యాన్స్ ఉగ్రమ్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అంత బ్లైండ్ గా ఉగ్రమ్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో తెరకెక్కించకపోవచ్చు. ఉగ్రమ్ అనేది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కాబట్టి అతను ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఉగ్రమ్ లైన్స్ లో, ఆ ఛాయలు కనిపించడం సహజం. సందీప్ రెడ్డి వంగ ఎన్ని సినిమాలు చేసినా కూడా అర్జున్ రెడ్డి లైన్స్ ఛాయలు తప్పకుండా కనిపిస్తాయి. నీల్ విషయంలో కూడా అంతే… ఉగ్రమ్ ఛాయలు ఉంటూనే సలార్ కొత్త ప్రపంచంలో డిజైన్ చేసిన సినిమా అవుతుంది.
